Thu Mar 19 2026 07:43:04 GMT+0530 (India Standard Time)
నేడు ముచ్చింతల్ కు రాష్ట్రపతి రాక
రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ముచ్చింతల్ లోని శ్రీరామనగరలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. గత పది రోజులుగా ముచ్చింతల్ లోని శ్రీరామనగర్ లో రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకూ అందరూ వచ్చి ఇక్కడ యాగంలో పాల్గొంటున్నారు.
రెండు గంటల పాటు....
సమతా మూర్తి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 108 దేవాలయాలు కూడా విశేషంగా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈరోజు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి రాక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు రెండు గంటల పాటు రాష్ట్రపతి ఇక్కడే ఉండటంతో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు.
Next Story

