Thu Mar 19 2026 18:11:39 GMT+0530 (India Standard Time)
నేడు ముచ్చింతల్ కు రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ముచ్చింత్ లోని సమతామూర్తి కేంద్రానికి రానున్నారు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ముచ్చింత్ లోని సమతామూర్తి కేంద్రానికి రానున్నారు. సాయంత్రం ఐదుగంటలకు ఆమె ప్రత్యేక హెలికాప్టర్ లో ముచ్చింతల్ కు చేరుకుంటారు. అక్కడ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేదరి సమతామూర్తి కేంద్రం గేట్ నెంబరు 3కి చేరుకుంటారు. అక్కడ చినజీయర్ స్వామి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు.
సాయంత్రం 7 గంటల వరకూ...
అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 108 ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం 216 అడుగుల రామానుజ విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డైనమిక్ ఫౌంటైన్ షోను తిలిస్తారు. త్రీడీ లేజర్ షో చూసిన తర్వాత భక్తులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. రాత్రి ఏడు గంటల వరకూ అక్కడే ఉంటారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తను ఏర్పాటు చేశారు.
Next Story

