Thu Mar 19 2026 19:57:33 GMT+0530 (India Standard Time)
నేడు రాష్ట్రపతి షెడ్యూల్ ఇదే
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులతో రాష్ట్రపతి సమావేశం కానున్నారు. వారితో ముచ్చటించనున్నారు.
పోలీస్ అకాడమీలో...
మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకూ సర్దార్ వల్వభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో ఉంటారు. పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతో పాటు భూటాన్, నేపాల్, మారిషస్, మాల్దీవుల దేశాల అధికారులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమావేశం కానున్నారు.
Next Story

