Fri Dec 05 2025 21:50:19 GMT+0000 (Coordinated Universal Time)
BRS : నేటి నుంచి బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు
నేటి నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా లోక్సభ ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరగనున్నాయి

నేటి నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా లోక్సభ ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఐదు వందల మందికి ఆహ్వానం పంపారు. తెలంగాణ భవన్ లో జరగనున్న ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వం వహించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థి నిర్ణయంపై కేటీఆర్ నేతలు, పార్టీ ముఖ్యుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపి నివేదికను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అందివ్వనున్నారు.
లోక్సభ ఎన్నికల్లో....
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో బీఆర్ఎస్ అప్రమత్తమయింది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి క్యాడర్ లో జోష్ నింపాలని భావిస్తుంది. అందుకోసమే లోక్సభ అభ్యర్థుల విషయంలో నేతల అభిప్రాయాలను తెలుసుకుని బలమైన నేతలను బరిలోకి దించాలన్న నిర్ణయానికి వచ్చింది. అందుకోసమే ఈ సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ఎవరైనా అభ్యర్థి విషయంలో ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం కల్పించారు.
Next Story

