Fri Dec 19 2025 02:35:52 GMT+0000 (Coordinated Universal Time)
అతడి వల్లే: ప్రవళిక కుటుంబసభ్యులు
గ్రూప్ 2 అభ్యర్ధి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా

గ్రూప్ 2 అభ్యర్ధి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమని చెబుతూ ఉన్నారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా అదే విషయాన్ని తెలిపారు. ఆత్మహత్యకు శివరామే కారణమని తన బిడ్డ చావుకు కారణమైన శివరామ్‌కు ఉరిశిక్ష వేయాలని ప్రవళిక తల్లి ప్రభుత్వాన్ని కోరారు. తమను రాజకీయాల్లోకి లాగి, టార్చర్ పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు ప్రవళిక కుటుంబ సభ్యులు. శివరామ్ వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని.. తన బిడ్డకు న్యాయం జరగాలంటే శివరామ్‌కు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమ వ్యవహారమే ప్రవళిక ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చామని చెప్పారు. ప్రవళిక ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలుసునని చెప్పారు. ప్రేమించిన వ్యక్తి మోసం చేసి మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడనే ప్రవళిక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని నిర్దారించామన్నారు. ప్రవళిక హాస్టల్లో ఉన్నవారి నుంచి వివరాలు సేకరించడం జరిగిందని చెప్పారు. అమ్మాయి గదిలో సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్, లవ్ సింబల్ ఉన్న మరో లేఖ లభించిందని తెలిపారు. మొబైల్ ఫోన్‌కు లాక్ లేదని.. అందులో కొంత చాటింగ్ కనిపించిందని చెప్పారు. ఈ మూడింటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్టు తెలిపారు. డేటా రీట్రైవ్ చేసిన తర్వాత మరింత సమాచారం తెలుస్తుందన్నారు.
Next Story

