Fri Mar 27 2026 22:05:32 GMT+0530 (India Standard Time)
మున్సిపల్ ఎన్నికలపై మంత్రి పొన్నం సంచలన కామెంట్స్
మున్సిపల్ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కామెంట్స్ చేశారు

మున్సిపల్ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కామెంట్స్ చేశారు. కరీంనగర్ లో బీజేపీ, బీఆర్ఎస్ లకు సీట్ల ఒప్పందం కుదిరిందని ఆయన అన్నార. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో రహస్య ఒప్పందం రెండు పార్టీలకు కుదిరిందని మంత్రి తెలిపారు.
అవగాహనతోనే అభ్యర్థుల ఎంపిక...
బీజేపీ, బీఆర్ఎస్ అవగాహనతోనే అభ్యర్థుల ఎంపిక జరిగిందని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలు వీళ్లను నమ్మవద్దని, కాంగ్రెస్ ను ఓడించేందుకు రెండు పార్టీలు ఒక్కటయ్యాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. వంద కోట్ల డీల్ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా.. మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టు అంటూ సవాల్ విసిరారు.
Next Story

