Thu Apr 09 2026 14:25:00 GMT+0530 (India Standard Time)
Telangana : కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. పలు చోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి 50కి పైగా శాతం ఓట్లు మాత్రమే నమోదయినట్లు అధికారులు తెలిపారు. పట్టణ ఓటర్లు మున్సిపల్ ఎన్నికల పట్ల అనాసక్తి చూపుతున్నారని అర్థమవుతుంది. ఉదయం నుంచి కొన్ని చోట్ల తప్పించి ఎక్కువ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి.
లంచ్ తర్వాత పెరుగుతుందని...
అయితే లంచ్ తర్వాత పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఐదు గంటల వరకూ క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు హక్కును వినియోగించే అవకాశాలు కల్పించనున్నారు. సాయంత్రానికి 70 శాతం వరకూ పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు.
Next Story

