Thu Apr 09 2026 17:50:51 GMT+0530 (India Standard Time)
Telangana : మందకొడిగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయిన పోలింగ్ చాలా చోట్ల మందకొడిగా సాగుతుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతుండటంతో పోలింగ్ కేంద్రాలకు పెద్దగా ఓటర్లు ఉదయం రాలేదు. ఉదయం పది గంటల నుంచి భారీగా ఓటర్లు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.
కొన్నిచోట్ల అవాంతరాలు...
మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల నెంబర్లు తేడాలు ఉండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలింగ్ నిలిపేశారు. అలాగే వరంగల్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
Next Story

