Thu Mar 19 2026 11:32:59 GMT+0530 (India Standard Time)
Telangana Elections Polling : పోలింగ్ ముగిసింది... అంతా ప్రశాంతమే
తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 119 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది

తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 119 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. అయితే క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రం ఓటు వేసే వారికి అనుమతిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకూ జరిగింది. అయితే కొన్ని చోట్ల ఇంకా క్యూ లైన్ లలో అనేక చోట్ల ఓటర్లు వేచి ఉన్నారు. హైదరాబాద్ నగరంలోనూ కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికీ ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని కొన్ని కేంద్రాల్లో పోలింగ్ ఏడు గంటల వరకూ జరిగే అవకాశముందని చెబుతున్నారు.
ఉదయం పెద్దగా...
పోలింగ్ ఉదయం ప్రారంభమయినప్పుడు పెద్దగా ఓటర్లు రాలేదు. చలి ప్రభావం కావచ్చు. పెద్దగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో కనిపించలేదు. కానీ మధ్యాహ్నం నుంచి ఓట్లు వేయడానికి ఎక్కువ మంది రావడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. అందరూ ఒక్కసారిగా రావడంతో గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ముగిసినా కొన్ని చోట్ల మాత్రం పోలింగ్ ఇంకా కొంతసేపు కొనసాగే అవకాశముందని సమాచారం అందుతుంది. చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగానే జరిగింది.
Next Story

