Mon Dec 08 2025 10:50:51 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై హాట్ హాట్ కామెంట్స్
కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై రాజకీయంగా తెలంగాణలో వేడి పుట్టింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది

కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై రాజకీయంగా తెలంగాణలో వేడి పుట్టింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఢిల్లీలో అడుగు పెట్టిన వెంటనే కేటీఆర్ ట్వీట్ చేశారు. తాను ఇప్పుడే ఢిల్లీలో అడుగు పెట్టానని, అప్పుడే హైదరాబాద్ లో ప్రకంపనలు మొదలయ్యాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో వణుకుపుడితే ఎలా అని ఆయన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.
కేటీఆర్ ఢిల్లీ పర్యటన...
అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఢిల్లీ వెళ్లింది కేసుల మాఫీకోసమేనని అన్నారు. లేకుంటే పట్టణాభివృద్ధిశాఖ మంత్రితో ఏంటి పని అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ పై ఫార్ములా ఇ రేస్ పై ఆరోపణలు వచ్చాయని, ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించేందుకు గవర్నర్ అనుమతి కోరారన్న పొంగులేటి, గవర్నర్ నిర్ణయం వెలువడకుండా కేంద్రప్రభుత్వం వద్ద పైరవీలు చేసుకోవడానికి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారన్న పొంగులేటి, ఒక్క ఫార్ములా రేస్ మాత్రమే కాదని, అనేకకేసులు త్వరలో వెలుగు చూస్తాయని అన్నారు.
Next Story

