Fri Mar 20 2026 09:51:27 GMT+0530 (India Standard Time)
షర్మిలను బయటకు రానివ్వకుండా
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. షర్మిలను బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. షర్మిలను బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ వద్ద ఆందోళనకు పిలుపు నివ్వడంతో షర్మిలను ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనిపై షర్మిల అభ్యంతరం తెలిపారు.
పోలీసులతో వాగ్వాదం...
తనను ఎందుకు అడ్డుకుంటున్నారని వైఎస్ షర్మిల పోలీసులను ప్రశ్నించారు. తాను టీఎస్పీఎస్సీ ఛైర్మన్ తో మాట్లాడేందుకు వెళుతున్నానని, ముట్టడికి కాదని ఆమె తెలిపారు. అయినా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తూ తనను ఇంటిలోనే నిర్భంధించారని ఆమె మండి పడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్ షర్మిలకు మధ్య వాగ్వాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతుందని ఆమె ఆరోపించారు.
Next Story

