Thu Dec 18 2025 23:03:05 GMT+0000 (Coordinated Universal Time)
టోల్‌ప్లాజా వద్ద 16.50 లక్షల పట్టివేత
షాద్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో టోల్‌ప్లాజా వద్ద పెద్దయెత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు తెల్లవారుజామున చేపట్టిన తనిఖీలలో భాగంగా వనపర్తి నుండి హైదరాబాద్ కు వెళ్తున్న జయదేవ్ అనే వ్యక్తి ఐదున్నర కిలోల వెండి 16 లక్షల 50 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
వెండి కూడా...
సోదాలలో భాగంగా తెల్లవారుజామున సిఐ ప్రతాప్ లింగం తదితర సిబ్బంది తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో జయదేవ్ అనే వ్యక్తి నుండి రాయికల్ టోల్ ప్లాజా వద్ద వీటిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నగదు రవాణాపై ఇతర విలువైన వస్తువులపై ఎన్నికల సమయంలో ఆంక్షలున్నాయి. స్వాధీనం చేసుకున్న సొత్తును ఎన్నికల అధికారి ఆర్డీవోకు అందజేయనున్నట్లు సిఐ ప్రతాప్ లింగం తెలిపారు.
Next Story

