Fri Dec 05 2025 23:17:26 GMT+0000 (Coordinated Universal Time)
BRS : పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులతో దురుసుగా వ్యవహరించినందుకు కేసు నమోదయింది

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు అధికారులతో దురుసుగా వ్యవహరించినందుకు ఆయనపై కేసు నమోదయింది. కౌంటింగ్ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
పోలీసులను దూషించినందుకు...
ఎమ్మెల్సీగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ పై పోటీకి దిగారు. ఆయనకు ఈసారి బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వడంతో తనను గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్నికల కమిషన్ కూడా దీనిపై వివరణ కోరింది. తాజాగా మరో వివాదంలో పాడి కౌశిక్ రెడ్డి చిక్కుకున్నారు.
Next Story

