Thu Jul 17 2025 00:43:29 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్ పై మరో కేసు నమోదు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపర్చేలా మాట్లాడటంతో పాటు, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడంతో కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారని, ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story