Fri Jan 30 2026 01:07:56 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే రఘునందన్ పై కేసు నమోదు
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు.

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 228 కింద కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే రఘునందన్ కొన్ని వీడియోలను బయటపెట్టారు. అవి అభ్యంతరకరంగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
వీడియోలు బయటపెట్టారని....
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకు ఒకరు ఉన్నారని రఘునందన్ ఒక వీడియోను విడుదల చేశారు. బాలిక వీడియోలు, ఫొటోలు బయటపెట్టడంతో అది సంచలనంగా మారింది. ఎమ్మెల్యే కొడుకు కారులో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిన తీరును వీడియోలను ఆయన బయటపెట్టారు. బాలిక వీడియోలను బయటపెట్టడంపై రఘునందన్ పై కేసు నమోదు చేశారు. అయితే రఘునందన్ మాత్రం తాను బాలిక ఫేస్ ను బయటపెట్టలేదని, కేవలం మేజర్ గా ఉన్న ఎమ్మెల్యే కొడుకు ప్రమేయంపైనే వీడియోలు విడుదల చేశానంటున్నారు. తనకు లభించిన ఆధారాలను బయటపెట్టారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
Next Story

