Tue Jan 20 2026 18:01:40 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ షర్మిల దీక్షకు నో పర్మిషన్
రేపు టి సేవ్ అధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద జరప తలపెట్టిన వైఎస్ షర్మిల నిరాహర దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు

రేపు టి సేవ్ అధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్షం నేతలతో కలిసి వైఎస్ షర్మిల నిరాహర దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరాపార్క్ వద్ద దీక్షకు అనుమతిని పోలీసులు నిరాకరించారు.
నిరుద్యోగ సమస్యపై...
దీక్ష కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయన్న కారణాలతో పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు అనుమతి నిరాకరించడం తో తదుపరి కార్యాచరణ పై పార్టీ ముఖ్యనేతలతో వైఎస్ షర్మిల చర్చిస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవడమా? లేదా క పార్టీ కార్యాలయం వద్ద దీక్ష కొనసాగించాలా అనే దానిపై చర్చ జరుపుతున్నారు.
Next Story

