Thu Mar 19 2026 14:16:17 GMT+0530 (India Standard Time)
రేవంత్ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఆయనను బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలిసింది.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఆయనను బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలిసింది. రేవంత్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
రచ్చబండకు ....
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గజ్వేల్ లోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు సమీపంలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు. కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రచ్చబండ కార్యక్రమం జరగనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ తన ఫాం హౌస్ లో 150 ఎకరాల్లో వరి పంట వేశారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తాను మీడియాకు చూపిస్తానని తెలిపారు. దీంతో రేవంత్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
Next Story

