Tue Mar 17 2026 11:37:43 GMT+0530 (India Standard Time)
Kalvakuntla Kavitha : కవిత కారు తనిఖీ.. అయితే ఆమె ఏమన్నారంటే...?
పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారును తనిఖీలు చేశారు.

పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారును తనిఖీలు చేశారు. ఆమె నిజామాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కవిత పోలీసులు తనిఖీలకు సహకరించారు. కారును క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఆమె వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. తనిఖీలు పూర్తయిన తర్వాత కవిత తిరిగి ప్రచారానికి వెళ్లిపోయారు.
నిజామాబాద్ జిల్లాలో...
కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆమె అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి ఆమె గత కొంతకాలంగా ప్రచారం చేస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే పోలీసులు కవిత కారును తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పోలీసులతో పాటు ఎన్నికల కమిషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే కవిత మాత్రం తాము ఎన్నికల అధికారులకు పూర్తిగా సహకరిస్తామని తనిఖీలు ఎవరి కారునైనా తనిఖీ చేయవచ్చని అన్నారు.
Next Story

