Sat May 11 2024 10:51:42 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్ వాహనం తనిఖీ
తెలంగాణ మంత్రి కేటీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు
తెలంగాణ మంత్రి కేటీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అమలుపర్చడంలో భాగంగా పోలీసులు ఆయన వాహనాన్ని తనిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళుతుండగా మధ్యలో తూప్రాన్ వద్ద పోలీసులు కేటీఆర్ వాహనాన్ని ఆపి తనిఖీలు జరిపారు. వాహనంలో డబ్బు, మద్యం వంటివి ఏవైనా ఉన్నాయోమోనని పరిశీలించారు.
ఎన్నికల సందర్భంగా...
తెలంగాణ ఎన్నికల సందర్భంగా పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తూ అక్రమంగా తీసుకెళుతున్న నగదు, బంగారాన్ని సీజ్ చేశారు. ఇప్పటి వరకూ నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగానే నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అందులో భాగంగానే కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనాన్ని తనిఖీకి కేటీఆర్ పూర్తిగా సహకరించారని పోలీసులు తెలిపారు.
Next Story