Sun Mar 15 2026 20:02:10 GMT+0530 (India Standard Time)
ఎంపీ కోమటిరెడ్డి పై పోలీస్ కేసు
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పోలీసు కేసు నమోదయింది. నల్లగొండ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు

భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పోలీసు కేసు నమోదయింది. నల్లగొండ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ కుమారుడిని బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదయింది. 506 సెక్షన్ కింద కేసును నమోదు చేశారు. చెరుకు సుధాకర్ కుమారుడు సుహాన్ ఫిర్యాదు మేరకు నల్లగొండ వన్ టౌన్ పోలీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారు.
బెదిరించారన్న...
ఇటీవల పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుహాస్ కు ఫోన్ చేసి ఆయన తండ్రి చెరుకు సుధాకర్ విషయంలో వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను చంపుతానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెదిరించారంటూ సుహాస్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే తాను భావోద్వేగంతోనే అన్నానని, బెదిరించలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు.
Next Story

