Fri Dec 05 2025 17:49:31 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ మాజీ ఎంపీపై కేసు నమోదు
బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పై పోలీసు కేసు నమోదు అయింది.

బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పై పోలీసు కేసు నమోదు అయింది. భూ కబ్జా ఆరోపణలపై ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబరు 14లో భూమిని కబ్జాకు సంతోష్ కుమార్ ప్రయత్నించారని నవయుగ కంపెనీ ప్రతినిధి మాధవ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు.
భూ కబ్జా కేసును...
సంతోష్ కుమార్ తో పాటు లింగారెడ్డి శ్రీధర్ పై కూడా కేసు నమోదయింది. 1350 చదరపు గజం స్థలానని తాము కొనుగోలు చేశామని, అయితే నకిలీ డాక్యుమెంట్లతో ఆ స్థలాన్ని సంతోష్ కుమార్ గ్యాంగ్ కబ్జాకు ప్రయత్నించిందని నవయుగ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story

