Fri Dec 05 2025 14:32:43 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
బీజేపీఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసు కేసు నమోదయింది. మత విధ్వేషాలు రెచ్చగొట్టారన్న ఆరోపణలపై రాజాసింగ్ పై కేసు నమోదయింది.

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసు కేసు నమోదయింది. మత విధ్వేషాలు రెచ్చగొట్టారన్న ఆరోపణలపై రాజాసింగ్ పై కేసు నమోదయింది. మత విధ్వేషాలను రాజా సింగ్ రెచ్చగొడుతున్నారంటూ కొన్ని వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన కాంచన్ బాగ్ పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. తమ మతాన్ని కించపర్చారంటూ మత పెద్దలు ఫిర్యాదు చేశారు.
వివాదాస్పద వ్యాఖ్యలు.....
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయన దేశ, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడుతుంటారు. మత విధ్వేషాలను రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పై కూడా ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో వీడియో విడుదలకు సంబంధించి ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- Tags
- raja singh
- mla
- bjp
Next Story

