Fri Mar 20 2026 11:42:21 GMT+0530 (India Standard Time)
వైఎస్ షర్మిల అరెస్ట్
పార్టీ నేతలతో కలిసి పార్లమెంట్ ముట్టడికి బయలు దేరనున్న షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆందోళనకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ షర్మిల ధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన విచారణ జరపాలంటూ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
పార్లమెంటు ముట్టడికి...
అయితే పార్టీ నేతలతో కలిసి పార్లమెంట్ ముట్టడికి బయలు దేరనున్న షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలో పార్లమెంటు కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. షర్మిలతో పాటు ఆమె వెంట ఉన్న కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story

