Fri Dec 05 2025 20:59:27 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో ప్రధాని మోదీ.. పోస్టర్ల కలకలం
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు చేరుకున్నారు. హకీం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మోదీ వరంగల్ బయలుదేరి వెళ్లనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు చేరుకున్నారు. హకీం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మోదీ వరంగల్ బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 10 : 30 గంటలకు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్కడ 10:45 వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలకరించారు అధికారులు. రంగురంగుల పూలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు పోలీసులు. 30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని వరంగల్ కు రావడం ఇదే తొలిసారి కావడంతో వరంగల్ పట్టణం ముస్తాబైంది. దాదాపు 30 ఏళ్ల కిందట ప్రధాని హోదాలో పీవీ నర్సింహారావు వరంగల్ కు రాగా, ఆ తర్వాత ఇప్పుడు ప్రధాని మోదీ వస్తున్నారు.
మోదీ పర్యటన సందర్భంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరంగల్ జాతీయ రహదారిపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోదీ వరంగల్ పర్యటనను నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను కొందరు ఏర్పాటు చేశారు. వరంగల్ కు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు మార్గంలోనే వెళ్లాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. అవి కాస్తా రోడ్డు పక్కన దర్శనమిస్తున్నాయి. మోదీ సర్.. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు పూర్తవుతుందంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు.
Next Story

