Wed Feb 19 2025 16:01:03 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : తెలంగాణలో ముదురుతున్న ఎండలు.. ఫిబ్రవరిలోనే ఇదేం సెగ సామీ?
నిన్నటి వరకూ చలితో వణికిన ప్రజలు నేడు ఉక్కబోతతో ఇబ్బంది పడుతున్నారు.ఉష్ణోగ్రతలు గరిష్ట స్థితికి చేరుకుంటున్నాయి

నిన్నటి వరకూ చలితో వణికిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉక్కబోతతో పాటు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థితికి చేరుకుంటున్నాయి. ఫిబ్రవరి మొదటి వారానికే చుక్కలు చూపిస్తున్నాయి. గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు. రాత్రి వేళ కొంత చలిగా అనిపిస్తున్నా ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎండ వేడిమి అధికంగా ఉంది. గత వేసవి కంటే ఈ ఏడాది వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకు తగినట్లుగానే ఎండ తీవ్రత పెరుగుతుంది. ఇప్పుడే 35 అనేక ప్రాంతాల్లో 35 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
నిన్నటి వరకూ చలిగాలులు... నేడు...
తెలంగాణలో నిన్నటి వరకూ చలి గాలుల తీవ్రతతో ఇబ్బంది పడిన ప్రజలు నేడు వేడి గాలులతో అల్లాడుతున్నారు. ఇంటి నుంచి బయటకుక రావడనికే జంకుతున్నారు. హైదరాబాద్ నగరంలోనూ అనేక ప్రాంతాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి మొదటి వారంలోనే నమోదు అవుతున్నాయి. ఇక మే నెలలో ఇది ఏ స్థాయికి పెరుగుతుందన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలుంటాయని, చలి తీవ్రత తరహాలోనే ఎండలు కూడా అదిరిపోతాయని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ...
ఎండలకు బయటకు రాకుండా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు. వడదెబ్బ తగిలే అవకాశమున్నందున తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల డీ హైడ్రేషన్ కు గురికాకుండా ఉంటారని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగి రెండు నుంచి ఆరు డిగ్రీల వరకూ పెరిగాయని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెబుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే వ్యాధుల బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Next Story