Sat Mar 07 2026 23:57:45 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : ప్రగతి భవన్ కు క్యూ కట్టిన ప్రజలు
ప్రగతి భవన్ కు ప్రజలు క్యూ కట్టారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ప్రగతి భవన్ కు ప్రజలు తమ సమస్యలను చెప్పేందుకు వచ్చారు

ప్రగతి భవన్ కు సామాన్య ప్రజలు క్యూ కట్టారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ప్రగతి భవన్ కు ప్రజలు తమ సమస్యలను చెప్పేందుకు వచ్చారు. ప్రతి శుక్రవారం ప్రగతి భవన్ లో ప్రజాదర్బార్ ను నిర్వహిస్తామని వెల్లడించిన నేపథ్యంలో ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలతో పాటు సామూహిక సమస్యలను కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తేనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు.
అన్నీ సమస్యలు...
వాటిని వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు, భూములకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా వచ్చాయని తెలిసింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో కూడా తమకు అన్యాయం జరిగిందని కొందరు రేవంత్ దృష్టికి తెచ్చారు. అందిన సమస్యలన్నింటినీ కంప్యూటర్ లోకి పంపేందుకు ఇరవై మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పని చేస్తున్నారు.
Next Story

