Thu Jan 22 2026 01:09:48 GMT+0000 (Coordinated Universal Time)
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన
నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు.

నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు. దాదాపు 36 గంటల పాటు జాతీయరహదారిని స్థంభింపచేశారు. నాలుగు గంటల పాటు ఆర్డీవోను బంధించారు. దిలావర్పూర్ లో ఆర్డీవోను రక్షించిన పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఈరోజు మాత్రం జాతీయ రహదారిపై ఎవరూ రాకుండా అన్నిజాగ్రత్తలు పోలీసులు తీసుకుంటున్నారు.
ఆందోళన కారుల అరెస్ట్...
తమకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని, దాని వల్ల తమ భూములు కోల్పోవడమే కాకుండా కలుషితమైన గాలి ఈ ప్రాంతంలో వ్యాపిస్తుందని పెద్దయెత్తున మహిళలు, పురుషులు జాతీయ రహదారిపై రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈరోజు కూడా ఆ ప్రాంతంలో ఐదు వందల మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే అసాంఘికశక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు.
Next Story

