Tue Jan 20 2026 02:41:33 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : దసరాకు తెలంగాణలో ఫుల్లుగా తాగేశారు... నెలలో అమ్మకాలు ఎంతంటే?
తెలంగాణలో దసరా పండగ కు ఫుల్లుగా మద్యం సేవించారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం లభించింది

తెలంగాణలో దసరా పండగ కు ఫుల్లుగా మద్యం సేవించారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం లభించింది. ఈ ఏడాది సెప్టంబరు నెలలో 3,048 కోట్ల రూపాయల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి. గత నెలలో దసరా పండగ తో పాటు సెలవులు రావడంతో భారీగా ఆదాయం పెరిగిందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. పండగతో పాటు జోరు వానలు కూడా మద్యం సేల్స్ పెరగడానికి కారణమని అంటున్నారు.
వర్షాలు.. దసరా సెలవులు...
సెప్టంబరు మాసమంతా వర్షాలు పడుతుండటంతో చల్లటి వాతావరణం మద్యం అమ్మకాలను భారీగా పెంచాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాల కారణంగా మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. దీనికి తోడు దసరా సెలవులు కూడా కలసి వచ్చాయని తెలిపింది. అదే సమయంలో గత ఏడాది ఇదే నెలలో మద్యం అమ్మకాలు 2,838 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. అక్టోబరు ఒకటోతేదీన ఒక్కరోజు 86.23 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏడు శాతం మద్యం సేల్స్ పెరిగాయని తెలిపారు.
Next Story

