Sat Mar 15 2025 14:49:40 GMT+0000 (Coordinated Universal Time)
Ration Cards : గుడ్ న్యూస్.. రేషన్ కార్డులు మీ ఇంటికి చేరే సమయం ఎంతంటే?
తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తిరిగి ప్రారంభం కావడంతో మీ సేవా కేంద్రాలకు జనం క్యూ కడుతున్నారు

తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తిరిగి ప్రారంభం కావడంతో మీ సేవా కేంద్రాలకు జనం క్యూ కడుతున్నారు. నిన్నటి వరకూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మీ సేవలో రేషన్ కార్డుల దరఖాస్తులను నిలిపేశారు. ఎన్నికల కోడ్ ముగియడంతో తిరిగి మీసేవా కేంద్రాల నుంచి దరఖాస్తులు చేసుకుంటున్నారు. లక్షలాది మంది తెలుపు రంగు రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ దఫా రేషన్ కార్డు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. పేదలు ఎప్పటి నుంచో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుందామని భావించినా పదేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులను గత ప్రభుత్వం జారీ చేయకపోవడంతో అత్యధిక డిమాండ్ ఏర్పడింది. రేషన్ కార్డులను మరో వారంలో జారీ చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.
సంక్షేమ పథకానికి...
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డు ముడి పడి ఉండటంతో పాటు రేషన్ కార్డుతో బియ్యం, పంచదార వంటివి అందుతుండటంతో పాటు ఆరోగ్య శ్రీ సేవలు లభించడం, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ తదితర పథకాలు అందాలంటే తెలుపు రంగు రేషన్ కార్డు అవసరం అని భావించి ప్రజలు క్యూ కడుతున్నారు. అందుకే తెల్ల రంగు రేషన్ కార్డుకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఈ కార్డుతోనే లభించనున్నాయి. రేషన్ కార్డులు లేని అర్హులైన వారందరికీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులను ఈ నెల 26వ తేదీ నుంచి జారీ చేయడం ప్రారంభిస్తామని చెప్పినా అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదు.
పది లక్షలకు పైగా...
గ్రామ సభల్లో వచ్చే అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత మాత్రమే తుది జాబితాను సిద్ధం చేశామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పినప్పటికీ వడపోత అనేది క్లిష్టంా మారిందని తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో దాదాపుు పది లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రాధమికంగా అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. గత ఏడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కార్డులను జారీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పినా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. కానీ తెలుపు రంగు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మరో సారి సర్వే చేసి ఇవ్వాలా? లేదా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
Next Story