Mon Jan 26 2026 10:36:16 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మరో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాగా
పెద్దలపల్లి జిల్లా సుల్తాన్ పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమయింది. బీఆర్ఎస్ ఛైర్మన్పై అవిశ్వాసం నెగ్గింది

పెద్దలపల్లి జిల్లా సుల్తాన్ పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమయింది. బీఆర్ఎస్ ఛైర్మన్పై అవిశ్వాసం నెగ్గింది. ఐదుగురు బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు అవిశ్వానికి మద్దతుగా ఓటు వేయడంతో సునీత పదవి కోల్పోయారు. దీంతో కొత్త మున్సిపల్ ఛైర్మన్ ను ఎన్నుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్మన్ ను ఎన్నికయ్యేందుకు అవకాశాలున్నాయి.
ప్రభుత్వం మారిన తర్వాత...
తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత వరసగా మున్సిపాలిటీలపై దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక స్థానాలను సాధించిన కాంగ్రెస్ పట్టణ ప్రాంతాల్లో మాత్రం పట్టు సాధించలేకపోయింది. దీంతో పట్టణ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ కన్నేసింది. ఇప్పటికే అనేక మున్సిపాలిటీలు కాంగ్రెస్ పరమయ్యాయి.
Next Story

