Thu Dec 18 2025 13:45:17 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి కేటీఆర్కు రేవంత్ కౌంటర్
మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. లీగల్ నోటీసులో అంశాలతో కౌంటర్ ఇచ్చారు

మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. లీగల్ నోటీసులో పలు అంశాలతో రేవంత్ కౌంటర్ ఇచ్చారు. లీగల్ నోటీస్ను వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన తన రిప్లైలో పేర్కాన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో తనకు, తన పేషీకి సంబంధం ఉందని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ వంద కోట్లకు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
లీగల్ నోటీసులకు రిప్లై...
దీనిపై ప్రభుత్వం నియమించిన సిట్ కూడా రేవంత్ రెడ్డిని విచారించింది. రేవంత్ తనపై అనవసర ఆరోపణలు చేస్తూ తన పరువును దిగజార్చారంటూ ఆయన పరువు నష్టం దావా వేశారు. దీనికి ఇప్పుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందన్న రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్ కు సంబంధం లేదని, ఈ దేశంలో లేనందున ఆ బాధ తెలియదని వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల తరపున మాట్లాడానని రేవంత్ రెడ్డి కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు.
- Tags
- revanth reddy
- ktr
Next Story

