Thu Mar 19 2026 12:39:08 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్
రాజ్యాంగం వల్లనే కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

రాజ్యాంగం వల్లనే కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో రెండు రోజుల దీక్ష ముగింపు సందర్బంగా ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానించడం తగదని చెప్పారు. ఎనిమిదేళ్లు రాష్ట్రంలో అరాచకం చేసిన కేసీఆర్ ను రాళ్లతో కొట్టేవారమని, రాజ్యాంగం మీద గౌరవం తోనే కేసీఆర్ బతికి బయటపడ్డాడని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రేపు అన్ని పోలీస్ స్టేషన్లలో....
రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించింది. రేపు అన్ని పోలీస్ స్టేషన్లలో సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేయనున్నాయి. ఎల్లుండి అంబేద్కర్ విగ్రహాలకు కాంగ్రెస్ పార్టీ పాలాభిషేకం చేయనుంది. మహిళా నేతలే పాలాభిషేకం చేస్తారని చెప్పారు. కేసీఆర్ కు ఆదర్శం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ ది నియంత పోకడ అని ఆయన ఫైర్ అయ్యారు.
- Tags
- revanth reddy
- kcr
Next Story

