Thu Mar 19 2026 02:11:32 GMT+0530 (India Standard Time)
రేవంత్ పాదయాత్రపై నేడు
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రపై నేడు స్పష్తత రానుంది. ఈరోజు గాంధీభవన్ లో పీసీసీ కార్యవర్గం సమావేశం కానుంది

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రపై నేడు స్పష్తత రానుంది. ఈరోజు గాంధీభవన్ లో పీసీసీ కార్యవర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఈ నెల 26వ తేదీ నుంచి జరగనున్న పాదయాత్రపై చర్చించనున్నారు. ఇప్పటికే యాత్ర పేరిట రేవంత్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
పీసీసీ కార్యవర్గ సమావేశంలో...
అయితే రేవంత్ పాదయాత్రకు అధిష్టానం నుంచి అనుమతి లేదని, 26వ తేదీ నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రను నేతలందరూ కలసి నిర్వహించాలని మాత్రమే హైకమాండ్ చెప్పిందని కొందరు నేతలు అంటున్నారు. అయితే దీనిపై ఇంత వరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. పాదయాత్రకు ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఈరోజు జరిగే సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈరోజు జరిగే సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు థాక్రే కూడా పాల్గొన్నారు.
Next Story

