Fri Dec 05 2025 17:50:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సిరిసిల్లలో రేవంత్
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర నేటికి ఇరవై రోజుకు చేరుకుంది. ఈరోజు సిరిసిల్లలో రేవంత్ రెడ్డి పాదయాత్ర జరగనుంది

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర నేటికి ఇరవై రోజుకు చేరుకుంది. యాత్ర ఫర్ ఛేంజ్ పేరుతో సాగుతున్న యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన కనపడుతుంది. ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర జరగనుంది. పవర్ లూమ్ వర్కర్క్ తో రేవంత్ రెడ్డి సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటలకు పద్మానగర్ వద్ద భోజనవిరామానికి ఆగుతారు.
రాత్రి వేములవాడ...
అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సిరిసిల్ల చేనేత కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాత్రికి వేములవాడ రుద్రారంలో రేవంత్ బస చేయనున్నారు. కాగా రేవంత్ రెడ్డి పాదయాత్రకు మంచి స్పందన లభిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రజలు పెద్దయెత్తున పాదయాత్ర వద్దకు తరలి వస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్తతో రేవంత్ ఓపికతో సెల్పీలు దిగుతున్నారు.
Next Story

