Wed Mar 18 2026 23:15:44 GMT+0530 (India Standard Time)
కొండగట్టులో రేవంత్ పూజలు
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన పాదయాత్రను కొనసాగిస్తున్నారు

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. గత 23 రోజుల నుంచి రేవంత్ రెడ్డి యాత్ర ఫర్ ఛేంజ్ పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ హాత్ సే హాత్ జోడో యాత్రకు అనుబంధంగా ఈ యాత్రను రేవంత్ రెడ్డి గత కొద్దిరోజులుగా చేస్తున్నారు. ఆయన పాదయాత్రకు మంచి స్పందన లభిస్తుంది.
ప్రజా సమస్యలు వింటూ...
అయితే ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డి కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదయాత్రలో ప్రజా సమస్యలు వింటూ కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేస్తూ రేవంత్ ముందుకు సాగుతున్నారు. రేవంత్ వెంట కాంగ్రెస్ నేతలతో పాటు పార్టీ అభిమానులు కూడా పాల్గొంటున్నారు. రేవంత్ ను చూసేందుకు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాదయాత్ర వద్దకు చేరుకుంటున్నారు.
Next Story

