Sun Dec 28 2025 03:44:38 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు పట్టిన గతే ఈయన కు : రేవంత్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పడు చంద్రబాబుకు పట్టిన గతే ఇప్పుడు కేసీఆర్ కు పడుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టిన గతే ఇప్పుడు కేసీఆర్ కు పడుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బోయినపల్లిలో జరిగిన కాంగ్రెస్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా అందరూ ఏకమయినా కాంగ్రెస్ ను ఏం చేయలేకపోయారన్నారు. వైఎస్ నేతృత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తుకు తెచ్చారు.
వైఎస్ మాదిరిగానే...
2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరోచితంగా పోరాడన్నారు. తిరిగి అతే తరహా పోరాటాన్ని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాడు వైఎస్ పాదయాత్ర పార్టీని అధికారంలోకి తెచ్చిందన్న రేవంత్ రెడ్డి అదే తరహాలో కాంగ్రెస్ మళ్లీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. బండ్లు, గుండ్లు ఏమీ చేయలేవని బండి సంజయ్ గురించి రేవంత్ పరోక్షంగా విమర్శలు చేశారు. కార్యకర్తలు, నేతలు ఏకమైతే కేసీఆర్ ను క్షణంలో మట్టికరిపించగలమని రేవంత్ అన్నారు.
Next Story

