Fri Dec 05 2025 16:43:21 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఈ విజయం అమరవీరులకు అంకితం
విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు

డిసెంబరు 3 ఒక ప్రత్యేక రోజు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే రోజు శ్రీకాంతాచారి అమరుడయ్యారన్నారు. అదే రోజు ప్రజలు విలక్షణమైన తీర్పు ప్రజలు ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కాంగ్రెస్ నేతలకు ఇచ్చినందుకు నమస్కారాలు తెలుపుతున్నానని చెప్పారు. తాను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలసి పార్టీని ముందుకు నడిపించడంలో అందరు నేతలు తమకు సహకరించారన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్షం కూడా సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.
అందరినీ కలుపుకుని పోతాం...
ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. అమరుల ఆకాంక్షలను అమలు చేయడానికి తాము కృషి చేస్తామని చెప్పారు. మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ముందుంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పార్టీ ఇన్ఛార్జి మాణిక్ రావు థాక్రే అభినందనలు తెలిపారు. కార్యకర్తల కృషితోనే ఈవిజయం సాధ్యమయిందన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారకులైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని ఆయన చెప్పారు.
Next Story

