Thu Mar 19 2026 14:16:17 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ చెరువు తెగిపోయింది
కాంగ్రెస్ లో ఇక చేరికలే ఉంటాయని, వెళ్లే వాళ్లు ఉండరని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

కాంగ్రెస్ లో ఇక చేరికలే ఉంటాయని, వెళ్లే వాళ్లు ఉండరని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రానున్న కాలంలో మరింత బలోపేతం అవుతుందని అన్నారు. టీఆర్ఎస్ చెరువు తెగిందని, కాంగ్రెస్ పార్టీ లో నేతలు చేరడానికి సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. పాదయాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు.
పేదలు బతకాలంటే....
నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, సామాన్యుడు బతకలేని స్థితిలో ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ కేసీఆర్ ను, అక్కడ మోదీని గద్దె దించితేనే పేదలకు కడుపు నిండా తిండి దొరుకుతుందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఫాం హౌస్ లో పెగ్గులు వేసి పడుకోవడం తప్ప రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. త్వరలోనే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతుందని, ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Next Story

