Wed Mar 18 2026 21:59:09 GMT+0530 (India Standard Time)
అనని మాటలు అన్నావంటారేంటి? రేవంత్ రెడ్డి
తన మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

తన మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తాను అనని మాటలను అన్నట్లు ప్రచారం చేయడం తగదని సూచించారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అమ్ముడుపోయారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామెంట్ చేశారనే వార్తలు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. సీనియర్ నేతలను దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి అన్నారని కూడా వ్యాఖ్యానాలు చేశారు.
దుష్ప్రచారమే...
అయితే దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన మాటలను వక్రీకరించారని తెలిపారు. వార్తలను ఖండిస్తున్నానని చెప్పారు. వార్తలు రాసే విషయంలో మీడియా సంయమనం పాటించాలని రేవంత్ రెడ్డి కోరారు.. రాజకీయ వివాదాలను సృష్టించి సమస్యను జటిలం చేసే ప్రయత్నాలు చేయవద్దని ఆయన మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు.
Next Story

