Thu Mar 19 2026 03:28:28 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ కు పేరు బంధం తెగిపోయినట్లే
తెలంగాణతో కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

తెలంగాణతో కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ గా పార్టీ మారడంతో తెలంగాణకు ఉన్న పేరు బంధం తెగిపోయినట్లేనని ఆయన అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని ఆయన అన్నారు. ఓట్లను చీల్చడానికే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
జగన్, కేసీఆర్ ఒక్కటే....
సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను కేసీఆర్ ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు. జగన్, కేసీఆర్ ఒక్కటేనని ఆయన అన్నారు. కేసీఆర్, జగన్ లు నాటకాలు ఆడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీకి సహకరించడం కోసమే బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
- Tags
- revanth reddy
- kcr
Next Story

