Fri Dec 05 2025 19:57:25 GMT+0000 (Coordinated Universal Time)
భయపడేదే లేదు : రేవంత్ రెడ్డి
కేసులకు తాను భయపడబోనని, కేసులకు తాను కొత్తేమీ కాదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

కేసులకు తాను భయపడబోనని, కేసులకు తాను కొత్తేమీ కాదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చేయాలన్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఏబీసీడీలు రాని ఎర్రబెల్లిని మంత్రిని చేశారన్నారు. తెలంగాణ ద్రోహులకు మంత్రివర్గంలో చోటు కల్పించారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అనే పదాన్ని అసహ్యించుకున్న వారిని అక్కున చేర్చుకున్న కేసీఆర్ ఎలా సమర్థించుకుంటారన్నారు.
ఏబీసీడీ రాని ఎర్రబెల్లికి...
కుటుంబపాలనలో తెలంగాణ ద్రోహులంతా మంత్రులయ్యారన్నారు. అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్నారు. కోవర్టు ఆపరేషన్ లో ఎర్రబెల్లి ఎక్స్పర్ట్ అని అన్నారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోవచ్చని, తాను భయపడే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి హాత్ హాత్ సే జోడో పాదయాత్ర నేటికి మూడో రోజుకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లాలో ఆయన పాదయాత్ర జరుగుతుంది. వేలాది మంది కార్యకర్తలతో రేవంత్ పాదయాత్రను చేస్తున్నారు.
Next Story

