Sun Feb 01 2026 22:09:49 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ సొమ్మును దోచి పెడుతున్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ ది రాజ్యాధికార విస్తరణ కాంక్ష అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్ ది రాజ్యాధికార విస్తరణ కాంక్ష అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీహార్ వెళ్లి అక్కడ గాల్వాన్ లో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందించారని, అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లికి చెంిన అమరజవాన్ యాదయ్య కుటుంబాన్ని మాత్రం కేసీఆర్ విస్మరించారన్నారు. బీహార్ వెళ్లి అక్కడ జవాన్లకు ఆర్థిక సాయం అందించారన్నారు. అలాగే ఇక్కడ అమర జవాన్ల కుటుంబాలను మాత్రం మర్చిపోయారన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు.
ఇక్కడి కుటుంబాన్ని....
కేసీఆర్ ది రాజ్యాధికార విస్తరణ కాంక్షా? లేక అమర జవాన్ల కుటుంబ సానుభూతా? అన్నది సమాజం ఆలోచించాలని ఆయన కోరారు. రెండు రోజుల క్రితం బీహార్ వెళ్లి అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందించి వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా అమర జవాన్ల బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు. జవాన్ల కుటుంబాల పరామర్శను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును దేశమంతా దోచి పెడుతున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. యాదయ్య కుటుంబానికి ఐదు ఎకరాలు, ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు
Next Story

