Thu Mar 19 2026 12:40:11 GMT+0530 (India Standard Time)
ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ... అందుకే?
ఏపీ లో పార్టీ బతకదని తెలిసి కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆంధ్ర్రప్రదేశ్ లో పార్టీ బతకదని తెలిసి కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రధాని మోదీ తెలంగాణపై విషం చిమ్ముతుంటే టీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. తమ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం తెలిపారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని రేవంత్ ఆరోపించారు.
తెలంగాణ ద్రోహుల చేత....
చారిత్రక నిర్ణయాలను అవమానపర్చేలా మోదీ వ్యాఖ్యానించారన్నారు. అప్పటి వరకూ మౌనంగా ఉన్న టీఆర్ఎస్ ఉలిక్కిపడి నిరసనలు తెలిపిందన్నారు. చట్ట సభల్లో తెలంగాణను అవమానిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీని నిలదీయడం లేదన్నారు. కేసీఆర్ రాష్ట్ర బంద్ కు పిలుపిస్తారేమోనని భావించామన్నారు. మోదీ వ్యాఖ్యలను కేసీఆర్ ఖండించలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో సమైక్యవాదుల పక్కన నిలిచిన తెలంగాణ ద్రోహులు నిరసన తెలియజేశారన్నారు.
ఫ్యామిలీ మొత్తం ఎక్కడ?
మోదీ అంటే కేసీఆర్ భయపడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు, కవితలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ కుటుంబం ఏ పనిచేయదని అన్నారు. ప్రత్యక్ష భాగస్వామ్యం ఎందుకు తీసుకోలేదన్నారు. దళారులుగా మారి దందాలు చేసుకుంటూ బీజేపీకి లొంగిపోయారని, మోదీకి తాబేదార్లుగా మారారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Next Story

