Wed Jan 21 2026 03:55:44 GMT+0000 (Coordinated Universal Time)
ఈడీ నోటీసులకు భయపడతామా?
రాహుల్ భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

రాహుల్ భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. జోడోయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి బీజేపీ బెంబేలెత్తి పోతుందని, అందుకని ఈడీని ఉసిగొల్పుతుందని అన్నారు. ఎక్కడ ఆయన యాత్ర ప్రవేశిస్తే అక్కడి నాయకులకు నోటీసులు ఇవ్వడం సాధారణమయిపోయిందన్నారు. కర్ణాటకలో యాత్ర ప్రవేశిస్తుందనగానే అక్కడ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు నోటీసులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
జోడో యాత్రను...
నేషనల్ హెరాల్డ్ కేసులోనూ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇవ్వడం ఇందులో భాగమేనని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాహుల్ వెంట వారు నడవకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. నోటీసుల పేరుతో వేధిస్తున్నారన్నారు. ఢిల్లీకి పిలిపించి గంటల తరబడి విచారించి ఇరిటేట్ చేయాలని చూస్తున్నారని అన్నారు. బీజేపీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాహుల్ పాదయాత్రతో మార్పు వస్తుందన్న ఉద్దేశ్యంతోనే గతంలో మూసేసిన నేషనల్ హెరాల్డ్ కేసును తిరిగి తెరిచారన్నారు. ఈడీ నోటీసులకు కాంగ్రెస్ నేతలు ఎవరూ భయపడరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Next Story

