Sun Mar 08 2026 07:34:48 GMT+0530 (India Standard Time)
దాడి ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి : రేవంత్
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వారిని ఎవరైనా అరెస్ట్ చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి కోరారు

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వారిని ఎవరైనా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హింసను కోరుకోదని, నమ్మదని కూడా ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అహింస మూల సిద్ధాంతంగా పనిచేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
దాడికి గల కారణాలను...
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని చెప్పారు. కత్తితో దాడి చేసిన వ్యక్తి ఎవరో బయటపెట్టాలని ఆయన కోరారు. దాడికి గల కారణాలు కూడా బయట ప్రపంచానికి తెలియజేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ విషయంలో వెంటనే పూర్తిస్థాయిలో పారదర్శకంగా విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Next Story

