Thu Mar 19 2026 05:01:01 GMT+0530 (India Standard Time)
దేశదిమ్మరిలా తిరగడానికేనా.. రేవంత్ ట్వీట్
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత విమానం కొనుగోలు చేయడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు

ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత విమానం కొనుగోలు చేయడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడంటూ ఆయన ట్వీట్ చేశారు. అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదని, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఏనాడూ పరామర్శించింది లేదని, ప్రగతి భవన్ ను వీడింది లేదని, ఫాం హౌస్ దాటింది లేదని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఎవని పాలయ్యిందిరో తెలంగాణ...
"ఇప్పుడు దేశ దిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ" అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తాను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించేందుకు పార్టీ తరుపున సొంత విమానం కొనుగోలు చేయాలని నిర్ణయించారన్న వార్తలపై రేవంత్ స్పందించారు.
- Tags
- revanth reddy
- kcr
Next Story

