Fri Dec 05 2025 15:51:58 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రైతు బంధు ఆగిపోవడానికి హరీశ్ కారణం
రైతు బంధు పథకం నిధుల ఉపసంహరణపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రైతు బంధు పథకం నిధుల ఉపసంహరణపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు చేసిన కామెంట్స్ తోనే రైతు బంధు నిలిచిపోయిందని ఆయన అన్నారు. రైతు బంధు నిధులతో ఓట్లు దండుకోవాలన్న దురాశ తప్ప మరొకటి లేదన్నారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోగానే రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఆయన తెలిపారు.
ఆందోళన వద్దు...
రైతులు రైతుబంధు పథకం నిధులపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అనవసరంగా కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతలు బురద జల్లుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకునే తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. ఎవరూ దిగులుపడాల్సిన పనిలేదన్నారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని, రైతుబంధు నిధులు జమచేస్తామని తెలిపారు.
Next Story

