Thu Mar 19 2026 10:26:21 GMT+0530 (India Standard Time)
Hyderabad : ఏప్రిల్ లో ఎన్నికలు.. రేవంత్ సంచలన కామెంట్స్
వచ్చే ఏప్రిల్ నెలలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

వచ్చే ఏప్రిల్ నెలలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని, నిధులు లేక పథకాలు నిలిచిపోకముందే కేసీఆర్ ఎన్నికలకు వెళతారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. అంతకు మించి కేసీఆర్ వద్ద మరో ఆప్షన్ లేదన్నారు రేవంత్ రెడ్డి.
అధికారంలోకి రాగానే...
తాము అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. సామాజిక న్యాయం అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. గిరిజన, ముస్లింలను కేసీఆర్ మోసం చేశారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Next Story

