Fri Mar 20 2026 03:02:34 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : ఈసీని కలిసేందుకు బయలుదేరిన రేవంత్
కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ ను కలిసేందుకు బయలుదేరేందుకు వెళ్లారు.

కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ ను కలిసేందుకు బయలుదేరేందుకు వెళ్లారు. ఈ నెల 3వ తేదీన కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో నాలుగో తేదీన కేబినెట్ సమావేశంపై వారు ఫిర్యాదు చేయనున్నారు. నిధులను మళ్లింపు జరుగుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే అవకాశముందన్న అనుమానాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదు చేయడానికి...
దీంతో పాటు అసైన్డ్ భూముల విషయంలోనూ ఏదో జరగబోతుందని తమకు సమాచారం అందిందని, ప్రభుత్వ లావాదేవీలపై నజర్ పెట్టాలంటూ ఎన్నికల కమిషన్ ను రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం కోరనుంది. మరికాసేపట్లో రేవంత్ తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ ను కలసి దీనిపై ఫిర్యాదు చేయనున్నారు.
Next Story

