Tue Mar 24 2026 11:46:59 GMT+0530 (India Standard Time)
Telangana : జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ భేటీ
జగిత్యాల నేత జీవన్ రెడ్డితో నేడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు

జగిత్యాల నేత జీవన్ రెడ్డితో నేడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఇటీవల లేఖను విడుదల చేశారు. రేపు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. పీసీసీ చీఫ్ తో పాటు ఏఐసీసీ కార్యదర్శి కూడా జీవన్ రెడ్డితో సమావేశమయ్యారు.
రేపు ప్రకటన నేపథ్యంలో...
తన డిమాండ్లను జీవన్ రెడ్డి వారి ముందు ఉంచారు. అయితే తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దని, తాము హైకమాండ్ కు అన్ని విషయాలు చెబుతామని, కొంత సమయం వేచి ఉండాలని వారు కోరినట్లు చెబుతున్నారు. మరి జీవన్ రెడ్డి చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

